Ram Charan: అమిత్‌షాను కలిసిన చిరంజీవి, రామ్‌చరణ్‌

భారతదేశ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థను తెలుగు సినిమా పరిశ్రమ గణనీయంగా ప్రభావితం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah) కొనియాడారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్‌ అవార్డు.

Updated : 18 Mar 2023 06:59 IST

అభినందించిన కేంద్ర హోంమంత్రి

ఈనాడు, దిల్లీ:  భారతదేశ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థను తెలుగు సినిమా పరిశ్రమ గణనీయంగా ప్రభావితం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah) కొనియాడారు. ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్‌ అవార్డు అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ప్రముఖ నటులు చిరంజీవి, రామ్‌చరణ్‌ శుక్రవారం రాత్రి కేంద్ర హోంమంత్రిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ను అమిత్‌షా శాలువాతో సత్కరించారు. నాటు నాటు పాటకు ఆస్కార్‌ అవార్డు రావడం, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం అద్భుత విజయం సాధించడంపై రామ్‌చరణ్‌ను కేంద్రమంత్రి అభినందించారు. తెలుగు చిత్రసీమకు చెందిన ఇద్దరు దిగ్గజాలను (చిరంజీవి, రామ్‌ చరణ్‌) కలవడం ఆనందంగా ఉందని అమిత్‌షా అన్నారు. ఈ విషయాలను ఆయన స్వయంగా ట్వీట్‌ చేశారు. రామ్‌ చరణ్‌కు అభినందనలు తెలిపి ఆశీస్సులు అందజేసినందుకు కేంద్ర హోంమంత్రికి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా బృందం, రామ్‌చరణ్‌ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చిరంజీవి ట్వీట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు