Rat in chutney: చట్నీలో ఎలుక.. సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టీయూలో ఘటన

సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలంలోని సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో విద్యార్థులకు వడ్డించే అల్పాహారానికి సంబంధించిన చట్నీలో ఎలుక తిరుగుతూ కనిపించడం కలకలం సృష్టించింది.

Published : 10 Jul 2024 04:19 IST

విచారణకు ఆదేశించిన మంత్రి దామోదర్‌

జోగిపేట, జోగిపేట టౌన్, న్యూస్‌టుడే: సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలంలోని సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో విద్యార్థులకు వడ్డించే అల్పాహారానికి సంబంధించిన చట్నీలో ఎలుక తిరుగుతూ కనిపించడం కలకలం సృష్టించింది. దీన్ని కొందరు విద్యార్థులు ఫోన్‌లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్‌ మారింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. దీంతో హుటాహుటిన జిల్లా అదనపు కలెక్టర్‌ మాధురి, ఆర్డీవో పాండు, ఫుడ్‌ సేఫ్టీ అధికారులు, జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ వెంకటేశ్వర్లు, రెక్టార్‌ విజయ్‌కుమార్‌ కళాశాలను పరిశీలించారు. వంట గది, దాని పరిసరాలు, భోజనశాలను తనిఖీచేశారు. కళాశాల సిబ్బంది, ప్రిన్సిపాల్, విద్యార్థులతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వసతిగృహాలు, హోటళ్లలో తనిఖీలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. ఘటనపై కళాశాల ప్రిన్సిపాల్‌ నర్సింహను వివరణ కోరగా.. విద్యార్థులంతా తిన్నాక.. రాత్రి సమయంలో ఆ పాత్రలు కడగడానికి పక్కన పెట్టినప్పుడు పడి ఉండొచ్చని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు