Revenue Tribunal: త్వరలో రెవెన్యూ ట్రైబ్యునల్‌

రాష్ట్రంలో నెలకొన్న భూ వివాదాల పరిష్కారానికి త్వరలో రెవెన్యూ ట్రైబ్యునల్‌ ఏర్పాటుచేయనున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Published : 15 Jun 2024 06:10 IST

కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తాం: మంత్రి పొంగులేటి

ధరణి కమిటీ సభ్యులు మధుసూదన్, సునీల్‌కుమార్, కోదండరెడ్డిలతో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో నెలకొన్న భూ వివాదాల పరిష్కారానికి త్వరలో రెవెన్యూ ట్రైబ్యునల్‌ ఏర్పాటుచేయనున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం హడావిడిగా, అధ్యయనాలు ఏవీ లేకుండా ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చిందని, దీనివల్ల ఎన్నో సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఆరోపించారు. శుక్రవారం సచివాలయంలో ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి, సునీల్‌కుమార్, మధుసూదన్‌లతో మంత్రి భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఖమ్మం జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించిన సమయంలో ప్రతి గ్రామంలో వందల కుటుంబాలు భూ సంబంధ సమస్యలు ఎదుర్కొనడాన్ని తాను స్వయంగా గమనించానన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, పెండింగ్‌ సమస్యలన్నీ త్వరలో కొలిక్కి వస్తాయని భరోసా ఇచ్చారు. ధరణి కమిటీ 18 రాష్ట్రాల్లోని ఆర్‌ఓఆర్‌ చట్టాలను అధ్యయనం చేసిందని తెలిపారు. భూమికి సంబంధించి ముఖ్యమైన చట్టాలన్నీ కలిపి ఒకే చట్టంగా రూపొందించాలని కమిటీ సూచించిందని, ఆ ప్రకారం నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న లోపభూయిష్టమైన ఆర్‌ఓఆర్‌-2020 చట్టం, దానితోపాటు ఏర్పడిన ధరణి పోర్టల్‌లో మార్పులు తీసుకొస్తామన్నారు. సామాన్యులకూ సులువుగా అర్థమయ్యేలా, అందుబాటులో ఉండేలా మార్పులుంటాయని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు