Anganwadi: అంగన్‌వాడీ చిన్నారులకు ఏకరూప దుస్తులు

అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లే ఆరేళ్ల లోపు చిన్నారులకు ఏకరూప దుస్తులను అందించాలని ప్రభుత్వం సంకల్పించినట్లు సమాచారం.

Published : 13 Jun 2024 05:38 IST

దేవరుప్పుల, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లే ఆరేళ్ల లోపు చిన్నారులకు ఏకరూప దుస్తులను అందించాలని ప్రభుత్వం సంకల్పించినట్లు సమాచారం. వీరికి ఇప్పటికే చదువు, పౌష్టికాహారం అందిస్తున్న ప్రభుత్వం తల్లిదండ్రులకు ఆర్థికంగా మరింత వెసులుబాటు ఉండేలా ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల మరింత మంది చిన్నారులు కేంద్రాల్లో చేరతారని భావిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న ఏకరూప దుస్తులను ఇప్పుడు కేంద్రాల్లోని చిన్నారులకూ ఇస్తారు. నాలుగు రంగుల్లో దుస్తులను రూపొందించి, ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున అందిస్తారు. వీటి డిజైన్లను కూడా నిర్ధారించి నమూనాలను అన్ని జిల్లాలకు పంపారు. ప్రస్తుతానికి జిల్లాల వారీగా వస్త్రాన్ని అందించనున్నారు. పాఠశాలల విద్యార్థుల దుస్తులు కుట్టిన పొదుపు సంఘాల మహిళలకే వీటి బాధ్యతలనూ అప్పగించనున్నారని సమాచారం. ఇప్పటికే ఆకర్షణీయమైన కథలు, కృత్యాల గేయాలతో పాఠ్యపుస్తకాలను రూపొందించి అందిస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని