Sabarimala: డిసెంబరు, జనవరిలో 38 శబరిమల ప్రత్యేక రైళ్లు

అయ్యప్పస్వామి భక్తుల సౌకర్యార్థం డిసెంబరు, జనవరి నెలల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 38 శబరిమల ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ప్రకటించింది.

Updated : 26 Nov 2022 06:52 IST

ఈనాడు, హైదరాబాద్‌: అయ్యప్పస్వామి భక్తుల సౌకర్యార్థం డిసెంబరు, జనవరి నెలల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 38 శబరిమల ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ప్రకటించింది. హైదరాబాద్‌-కొల్లాంకు డిసెంబరు 5, 12, 19, 26, జనవరి 2, 9, 16 తేదీల్లో.. కొల్లాం-హైదరాబాద్‌కు డిసెంబరు 6, 13, 20, 27, జనవరి 3, 10, 17.. నర్సాపూర్‌-కొట్టాయం డిసెంబరు 2, 9, 16, 30, జనవరి 6, 13.. కొట్టాయం-నర్సాపూర్‌ డిసెంబరు 3, 10, 17, 24, జనవరి 7, 14.. సికింద్రాబాద్‌-కొట్టాయం డిసెంబరు 4, 11, 18, 25, జనవరి 1, 8.. కొట్టాయం-సికింద్రాబాద్‌ డిసెంబరు 4, 11, 18, 25, జనవరి 2, 9 తేదీల్లో రైళ్లు బయలుదేరుతాయి.

రైల్వే ట్రాక్‌ వేగ సామర్థ్యం పరీక్షించిన జీఎం

కాజీపేట-రామగుండం-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మార్గాన్ని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ శుక్రవారం తనిఖీ చేశారు. సికింద్రాబాద్‌ డీఆర్‌ఎం అభయ్‌కుమార్‌ గుప్తాతో కలిసి డివిజన్‌లోని రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యాలను సమీక్షించారు. జమ్మికుంట స్టేషన్‌లో 20 కిలోవాట్ల సోలార్‌ ప్లాంటును ప్రారంభించారు. పెద్దంపేట-మంచిర్యాల మధ్య ఉన్న ప్రధాన వంతెన పటిష్ఠతను పరిశీలించారు. మంచిర్యాల నుంచి బెల్లంపల్లి రైల్వేస్టేషన్‌ వరకు రైల్వే ట్రాక్‌ వేగ సామర్థ్యాన్ని పరీక్షించారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు