TG News: రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా సుదర్శన్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా సి.సుదర్శన్‌రెడ్డిని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 06 Jul 2024 03:21 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా సి.సుదర్శన్‌రెడ్డిని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన జీఏడీ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఇప్పటి వరకు ముఖ్య ఎన్నికల అధికారిగా ఉన్న వికాస్‌రాజ్‌ సేవలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవాలని నిర్ణయించి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. తదుపరి సీఈవోగా నియమించేందుకు వీలుగా ముగ్గురు అధికారుల జాబితాను  పంపగా.. సుదర్శన్‌రెడ్డిని ఎంపిక చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని