Telangana Budget 2022: జాగా ఉంటే ఇంటికి రూ.3 లక్షలు

రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ కొత్త పథకానికి సర్కారు రూ.12 వేల కోట్లు ప్రతిపాదించింది. ఇప్పటికే మంజూరై నిర్మాణంలో ఉన్న వాటికి మరో రూ.3,650 కోట్లు ఇస్తామని చెప్పింది. సొంత స్థలం ఉంటే ఒక్కో ఇంటి¨కి రూ.మూడు లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు

Updated : 08 Mar 2022 05:29 IST

ఈనాడు, హైదరాబాద్‌ రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ కొత్త పథకానికి సర్కారు రూ.12 వేల కోట్లు ప్రతిపాదించింది. ఇప్పటికే మంజూరై నిర్మాణంలో ఉన్న వాటికి మరో రూ.3,650 కోట్లు ఇస్తామని చెప్పింది. సొంత స్థలం ఉంటే ఒక్కో ఇంటి¨కి రూ.మూడు లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రతిపాదించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల మందికి కొత్త పథకం ద్వారా ఆర్థిక సాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలకే నిర్ణయాధికారం ఇచ్చింది. ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల చొప్పున 3.57 లక్షల ఇళ్లు ఎమ్మెల్యేల కోటా కింద.. మిగిలిన 43 వేలు ముఖ్యమంత్రి పరిధిలో ఉంటాయి. ప్రమాద బాధితులు, నిర్వాసితులకు కేటాయించేందుకు వీలుగా వీటిని సీఎం కోటాలో ఉంచారు.

రెండేళ్ల క్రితం రూ.5 లక్షలని ప్రకటన

స్థలం ఉంటే ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం అందిస్తామని గత రెండు బడ్జెట్లలోనూ ప్రభుత్వం చెప్పింది. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థికసాయం చేస్తామని రెండేళ్లక్రితం ప్రకటించింది. గత బడ్జెట్‌లో రూ.11 వేల కోట్లు కేటాయించింది.ఇప్పుడు కొత్త పథకంలో లబ్ధిదారులకు సొంత స్థలం ఉండాలి. నిర్మాణానికయ్యే వ్యయంలో రూ.3 లక్షలు మాత్రమే సర్కారు ఇస్తుంది. మిగతా ఖర్చు లబ్ధిదారులే భరించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని