Telangana Budget 2022: నేతన్నలకు బీమా భరోసా

రాష్ట్రంలో వ్యవసాయం తరువాత ఎక్కువ మంది ఉపాధి పొందుతున్న చేనేత రంగంలోని కార్మికుల కోసం కొత్త బీమా పథకాన్ని ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించింది. ప్రస్తుతం అన్నదాతలకు కల్పిస్తున్న ‘రైతు బీమా’ మాదిరి ‘నేతన్నలకు బీమా’ను తీసుకొచ్చింది.

Updated : 08 Mar 2022 05:38 IST

కార్మికులు మరణిస్తే రూ.5 లక్షల పరిహారం

రాష్ట్రంలో వ్యవసాయం తరువాత ఎక్కువ మంది ఉపాధి పొందుతున్న చేనేత రంగంలోని కార్మికుల కోసం కొత్త బీమా పథకాన్ని ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించింది. ప్రస్తుతం అన్నదాతలకు కల్పిస్తున్న ‘రైతు బీమా’ మాదిరి ‘నేతన్నలకు బీమా’ను తీసుకొచ్చింది. ఈ ప్రకారం ఎవరైనా చేనేత కార్మికులు ఏ రకంగా మరణించినా వారి కుటుంబాలకు రూ.అయిదు లక్షల పరిహారం అందుతుంది. ఈ పథకానికి ప్రీమియం కింద రూ.50 లక్షలను ప్రభుత్వం కేటాయించింది. చేనేత, జౌళి రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చిన సర్కార్‌ రూ.467 కోట్లను కేటాయించింది. గత బడ్జెట్‌లో కేటాయింపులు రూ.341 కోట్లు కాగా... ఈసారి రూ.106 కోట్లను పెంచింది. వీటిలో బతుకమ్మ చీరలకు రూ.400 కోట్లను చూపింది. మిగిలిన పద్దుల్లో చేనేత, మరమగ్గాల కార్మికుల ప్రోత్సాహకాలకు రూ.3.14 కోట్లు, మరమగ్గాల కార్మికులకు ఆర్థికసాయం కింద రూ. 1.97 కోట్లను పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని