Telangana Budget 2022: భవన నిర్మాణ కార్మికులకు మోటార్‌ సైకిళ్లు

రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. తొలి విడతగా లక్ష మందికి రాయితీపై మోటారు సైకిళ్లను అందిస్తామని పేర్కొంది. త్వరలోనే విధివిధానాలు వెల్లడిస్తామని తెలిపింది. రాష్ట్రంలో 60 ఏళ్లలోపు భవన నిర్మాణ కార్మికులు 21.46 లక్షల మంది

Updated : 08 Mar 2022 07:59 IST

తొలి విడత లక్ష మందికి

రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. తొలి విడతగా లక్ష మందికి రాయితీపై మోటారు సైకిళ్లను అందిస్తామని పేర్కొంది. త్వరలోనే విధివిధానాలు వెల్లడిస్తామని తెలిపింది. రాష్ట్రంలో 60 ఏళ్లలోపు భవన నిర్మాణ కార్మికులు 21.46 లక్షల మంది ఉన్నారు. వీరిలో 12.68 లక్షల మంది ఏటా తమ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకుంటున్నారు. పథకం కింద 35 ఏళ్లలోపు వారిని పరిగణనలోకి తీసుకోవాలా? వయసుతో సంబంధం లేకుండా అర్హత ఉన్నవారికి ఇవ్వాలా అనే అంశంపై కార్మికశాఖ సమాలోచనలు చేస్తోంది. లక్ష వాహనాల్లో గరిష్ఠంగా 30-50 శాతం వరకు సబ్సిడీ భరించే అవకాశాలున్నట్లు సమాచారం. తొలి విడత కింద పథకం వ్యయం రూ.300-500 కోట్ల వరకు ఉండవచ్చని కార్మిక వర్గాలు పేర్కొంటున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని