Telangana Budget 2022: పారిశ్రామికం పరుగులెత్తేలా!

రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌( 2022-23)లో పారిశ్రామిక రంగానికి తగిన ప్రాధాన్యతనిచ్చింది. ఈ క్రమంలో రూ.3,496 కోట్లను కేటాయించింది. గత బడ్జెట్‌లో కేటాయించిన రూ. 3,077 కోట్ల కంటే ఇది రూ.419 కోట్లు ఎక్కువ. అలాగే పారిశ్రామిక రాయితీలు, ప్రోత్సాహకాలకు

Updated : 08 Mar 2022 05:33 IST

2021-22 రూ. 3,077 కోట్లు
2022-23 రూ. 3,496 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌( 2022-23)లో పారిశ్రామిక రంగానికి తగిన ప్రాధాన్యతనిచ్చింది. ఈ క్రమంలో రూ.3,496 కోట్లను కేటాయించింది. గత బడ్జెట్‌లో కేటాయించిన రూ. 3,077 కోట్ల కంటే ఇది రూ.419 కోట్లు ఎక్కువ. అలాగే పారిశ్రామిక రాయితీలు, ప్రోత్సాహకాలకు పెద్దపీట వేస్తూ.. రూ.2,519 కోట్ల(2021-22లో రూ.2,000 కోట్లు)ను ఆ పద్దుకే కేటాయించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పారిశ్రామిక రాయితీలకు ఇంత పెద్దమొత్తం కేటాయింపులు ఇదే ప్రథమం. వీటిలో ప్రధానంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ.2,142 కోట్లు; విద్యుత్‌ రాయితీకి రూ.190 కోట్లు; చిన్న, ఆహారశుద్ధి పరిశ్రమలకు పావలా వడ్డీ కింద రూ. 187 కోట్లు ఉన్నాయి. ఇంకా ఐటీ అభివృద్ధికి రూ.360 కోట్లు, గనులకు రూ.120 కోట్లు, నిమ్జ్‌ భూసేకరణకు రూ.30 కోట్లు, హస్తకళల అభివృద్ధికి రూ.9.60 కోట్లు, రామగుండంలోని ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ వాటా నిధికి రూ.10 కోట్లు, పారిశ్రామిక సమూహాల అభివృద్ధికి రూ.10 కోట్లు, హైదరాబాద్‌ పరిశోధనలు, ఆవిష్కరణల మండలికి రూ.రెండు కోట్లు చూపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని