IPS Transfers: భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీలు

రాష్ట్రంలో 28 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పలు జిల్లాల ఎస్పీలతోపాటు ఆ స్థాయి అధికారులను బదిలీ చేసింది.

Updated : 18 Jun 2024 05:44 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 28 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పలు జిల్లాల ఎస్పీలతోపాటు ఆ స్థాయి అధికారులను బదిలీ చేసింది. ఇటీవల పలు జిల్లాల కలెక్టర్లను మార్చిన ప్రభుత్వం.. తాజాగా ఎస్పీలను మార్చుతూ ఉత్తర్వులిచ్చింది. డీఐజీ, ఆపై స్థాయి అధికారులకు సంబంధించిన బదిలీలపై త్వరలోనే ఆదేశాలు వస్తాయని భావిస్తున్నారు.

ఎల్‌.సుబ్బరాయుడు (హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ), పీజేపీసీ ఛటర్జీ (కమాండెంట్, యాపల్‌గూడ బెటాలియన్, ఆదిలాబాద్‌), ఎంఏ బారీ (వరంగల్‌ మధ్యమండలం డీసీపీ), బి.రామ్‌ప్రకాశ్, (డిచ్‌పల్లి బెటాలియన్‌ కమాండెంట్‌), పి.సీతారాం (జనగామ ఎస్పీ)లను డీజీపీ కార్యాలయానికి ఎటాచ్‌ చేశారు. హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ సారథిగా ఇంకా ఎవరికీ బాధ్యతలు అప్పగించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని