Covaxin:కొవాగ్జిన్‌ టీకా పిల్లలకు సురక్షితం

కొవాగ్జిన్‌ టీకా పిల్లలపై బాగా పనిచేస్తోందని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ వెల్లడించింది. పిల్లలపై నిర్వహించిన 2వ దశ/ 3వ దశ క్లినికల్‌ పరీక్షల్లో ఈ టీకా భద్రత నిర్ధారణ కావడంతో పాటు ఎంతో ప్రభావశీలత ప్రదర్శించినట్లు

Updated : 31 Dec 2021 04:44 IST

భారత్‌ బయోటెక్‌ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: కొవాగ్జిన్‌ టీకా పిల్లలపై బాగా పనిచేస్తోందని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ వెల్లడించింది. పిల్లలపై నిర్వహించిన 2వ దశ/ 3వ దశ క్లినికల్‌ పరీక్షల్లో ఈ టీకా భద్రత నిర్ధారణ కావడంతో పాటు ఎంతో ప్రభావశీలత ప్రదర్శించినట్లు పేర్కొంది. ఈ టీకాను 12- 18 ఏళ్ల మధ్య వయస్కులైన పిల్లలకు ఇవ్వడానికి ఇటీవల భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతిచ్చిన సంగతి విదితమే. ఈ వ్యాక్సిన్‌పై దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో పిల్లలపై ఈ ఏడాది జూన్‌ నుంచి సెప్టెంబరు మధ్య ప్రయోగాలు నిర్వహించారు. మొత్తం 525 మంది అర్హులైన వాలంటీర్లను మూడు బృందాలుగా (12- 18, 6- 12, 2- 6 సంవత్సరాలు) విభజించి పరీక్షలు చేపట్టారు. వాటి ఫలితాల ప్రకారం.. పెద్దల కంటే పిల్లల్లో న్యూట్రలైజింగ్‌ యాంటీ- బాడీలు 1.7 రెట్లు అధికంగా కనిపించాయని, తీవ్రమైన సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమీలేవని భారత్‌ బయోటెక్‌ వివరించింది. మయోకార్డిటీస్‌ కానీ, రక్తం గడ్డకట్టడం కానీ కనిపించలేదని పేర్కొంది. పిల్లలపై కొవాగ్జిన్‌ టీకా ప్రయోగ ఫలితాలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నట్లు భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల ఈ సందర్భంగా వివరించారు. పిల్లలకు, పెద్దలకు అనువైన, భద్రమైన కొవిడ్‌ టీకా ఆవిష్కరించాలనే లక్ష్యాన్ని తాము సాధించినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని