TG TET: ఇక టెట్‌ ఏటా రెండుసార్లు

ఇక నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ప్రతి సంవత్సరం రెండుసార్లు నిర్వహించనున్నారు. ఈ మేరకు 2015 డిసెంబరు 23న ఇచ్చిన జీవో 36లో సవరణ చేస్తూ శనివారం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం జీవో 18 జారీ చేశారు.

Updated : 07 Jul 2024 08:23 IST

జూన్, డిసెంబరులో నిర్వహణ
విద్యాశాఖ జీవో జారీ

ఈనాడు, హైదరాబాద్‌: ఇక నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ప్రతి సంవత్సరం రెండుసార్లు నిర్వహించనున్నారు. ఈ మేరకు 2015 డిసెంబరు 23న ఇచ్చిన జీవో 36లో సవరణ చేస్తూ శనివారం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం జీవో 18 జారీ చేశారు. ఏటా జూన్, డిసెంబరులో పరీక్షను జరుపుతామని అందులో పేర్కొన్నారు. 

ఏటా ఒకసారి టెట్‌ నిర్వహిస్తామని 2015లో జీవో 36 జారీ చేసినా ఇప్పటి వరకు ఐదుసార్లు మాత్రమే పరీక్ష జరిపారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2016, 2017లో నిర్వహించారు. అనంతరం 2018 నుంచి 2021 వరకు చేపట్టలేదు. మళ్లీ 2022, 2023, 2024లో వరుసగా నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2011, 2012(రెండుసార్లు), 2014లో టెట్‌ జరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని