TET Results: నేడు టెట్‌ ఫలితాలు

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. తొలిసారి ఆన్‌లైన్‌ విధానంలో జరిగిన ఈ పరీక్షలు ఈ నెల 2వ తేదీతో ముగిశాయి.

Published : 12 Jun 2024 05:57 IST

డీఎస్సీ దరఖాస్తు గడువు 20 వరకు పొడిగింపు

ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. తొలిసారి ఆన్‌లైన్‌ విధానంలో జరిగిన ఈ పరీక్షలు ఈ నెల 2వ తేదీతో ముగిశాయి. పేపర్‌-1కు 85,996 మంది, పేపర్‌-2కు 1,50,491 మంది హాజరయ్యారు. మార్కుల కేటాయింపును సాధారణ పద్ధతిలో చేశారా? నార్మలైజేషన్‌ విధానంలోనా? అనేది అధికారులు వెల్లడించలేదు. ఫలితాల విడుదల సమయాన్ని కూడా వెల్లడించలేదు. డీఎస్సీ ద్వారా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. బుధవారం విడుదలయ్యే టెట్‌ ఫలితాల్లో కొత్తగా ఉత్తీర్ణులైన వారికి డీఎస్సీ రాసే అవకాశం కల్పించాలని సర్కారు నిర్ణయించింది. ఈ క్రమంలో డీఎస్సీ దరఖాస్తు గడువును ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించింది. డీఎస్సీకి ఇప్పటివరకు దాదాపు 2.35 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలు జులై 17 నుంచి 31 వరకు జరగనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని