TS Inter: ఇంటర్‌ విద్యార్థులూ.. 14416కు ఫోన్‌ చేయండి

హైదరాబాద్‌లో ఇంటర్‌ విద్యార్థి సాత్విక్‌ ఆత్మహత్య నేపథ్యంలో పరీక్షల ఒత్తిడి, ఇతర మానసిక సమస్యలు ఉంటే మానసిక నిపుణులకు చెప్పుకొని పరిష్కరించుకునేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కొత్తగా టోల్‌ ఫ్రీ నంబరును అందుబాటులోకి తెచ్చింది.

Published : 04 Mar 2023 07:06 IST

 పరీక్షల ఒత్తిడి, మానసిక సమస్యల పరిష్కారానికి టోల్‌ ఫ్రీ నంబరు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఇంటర్‌ విద్యార్థి సాత్విక్‌ ఆత్మహత్య నేపథ్యంలో పరీక్షల ఒత్తిడి, ఇతర మానసిక సమస్యలు ఉంటే మానసిక నిపుణులకు చెప్పుకొని పరిష్కరించుకునేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కొత్తగా టోల్‌ ఫ్రీ నంబరును అందుబాటులోకి తెచ్చింది. గతంలో కొందరు సైకాలజిస్టులను ఇంటర్‌బోర్డు నియమించేది. తాజాగా టెలీ మెంటల్‌ హెల్త్‌ అసిస్టెన్స్‌ అండర్‌ నెట్‌వర్కింగ్‌ అక్రాస్‌ ది స్టేట్స్‌(టెలీ-మానస్‌) పేరిట టోల్‌ ఫ్రీ నంబరు 14416ను తీసుకొచ్చారు. ఈ నంబరుకు ఉచితంగా ఫోన్‌ చేసి పరిష్కారం పొందొచ్చు. ఇంటర్‌ వార్షిక, సప్లిమెంటరీ పరీక్షలు, ఫలితాల ప్రకటన సమయాల్లో దాన్ని వినియోగించుకోవచ్చని ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ తెలిపారు. సైకాలజిస్టులు, సైకియాట్రిస్ట్‌లు అందుబాటులో ఉండి కౌన్సెలింగ్‌ ద్వారా విద్యార్థులకు తగిన పరిష్కారాలను సూచిస్తారు. ఇది రోజంతా పనిచేస్తుంది. అంతేకాకుండా ఆయా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డిస్ట్రిక్ట్‌ మెంటల్‌ హెల్త్‌ క్లినిక్‌ల పేరిట ఉచితంగా సైకాలజిస్టులు సేవలు అందిస్తారు. వారిని స్వయంగా కలిసి సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఈనెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో ఇంటర్‌ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు మొత్తం 9.50 లక్షల మంది పరీక్షలు రాయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని