TSRTC: సంక్రాంతికి 4,233 ప్రత్యేక బస్సులు.. 60 రోజులు ముందుగానే రిజర్వేషన్‌

సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాల మధ్య 4,233 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) వీసీ సజ్జనార్‌ తెలిపారు.

Updated : 10 Dec 2022 09:10 IST

ఈనాడు, హైదరాబాద్‌: సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాల మధ్య 4,233 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) వీసీ సజ్జనార్‌ తెలిపారు. వాటిలోని 585 బస్సులకు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌ బస్‌భవన్‌ నుంచి శుక్రవారం ఆయన రాష్ట్రంలోని ఆర్టీసీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. గతేడాది సంక్రాంతికి 3,736 ప్రత్యేక బస్సులు నడిపామని, ఈ దఫా వాటికి అదనంగా పది శాతం బస్సులను పెంచామని తెలిపారు. ‘‘జనవరి 7వ తేదీ నుంచి 15 వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం పట్టణానికి 125, కాకినాడ 117, కందుకూరు 83, విశాఖపట్నం 65, పోలవరం 51, రాజమహేంద్రవరానికి 40 ప్రత్యేక బస్సులు నడుపుతాం. వీటితోపాటు తెలంగాణలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలకు కూడా ఈ బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ప్రయాణికుల సౌకర్యార్థం 60 రోజుల ముందుగానే టికెట్‌ రిజర్వేషన్‌ సదుపాయం కల్పిస్తున్నాం. గతంలో 30 రోజుల ముందు మాత్రమే ఈ సౌకర్యం ఉండేది. వచ్చే ఏడాది జూన్‌ నెలాఖరు వరకు ఈ రిజర్వేషన్‌ సదుపాయం అందుబాటులో ఉంటుంది’ అని సజ్జనార్‌ వివరించారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు