Irrigation Projects: రిజర్వాయర్లన్నీ ఖాళీ

కృష్ణా, గోదావరి బేసిన్‌లలో రిజర్వాయర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అన్ని ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కనీస మట్టానికన్నా దిగువకు చేరాయి. కృష్ణా, గోదావరి నదులపై తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రిజర్వాయర్లన్నీ నిండటానికి 560 టీఎంసీలకు పైగా అవసరం.

Published : 18 Jun 2024 04:55 IST

తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు నిండడానికి 560 టీఎంసీలు అవసరం

అడుగంటిన నాగార్జునసాగర్‌ జలాశయం

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి బేసిన్‌లలో రిజర్వాయర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అన్ని ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కనీస మట్టానికన్నా దిగువకు చేరాయి. కృష్ణా, గోదావరి నదులపై తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రిజర్వాయర్లన్నీ నిండటానికి 560 టీఎంసీలకు పైగా అవసరం. ఎగువ రాష్ట్రాల్లోని ఆలమట్టి, జైక్వాడి తదితర రిజర్వాయర్లు సైతం ఖాళీగా ఉన్నాయి. అవన్నీ నిండిన తర్వాతే దిగువకు నీళ్లొచ్చే అవకాశం ఉంది. గత నీటి సంవత్సరంలో వర్షాభావంతో రిజర్వాయర్లలోకి నామమాత్రంగానే నీరొచ్చింది. ఈ సంవత్సరం వర్షాలు మెరుగ్గా ఉంటాయని అంచనా వేస్తున్నా, జులైలో కానీ పరిస్థితి ఆశాజనకంగా ఉండేలా లేదు. 

  • ఆలమట్టిలోకి వంద టీఎంసీలకుపైగా వస్తే కానీ దిగువకు వదిలే పరిస్థితిలేదు. తుంగభద్ర కూడా ఖాళీగా ఉంది. ఈ రిజర్వాయర్‌ నిండటానికి వంద టీఎంసీలు అవసరం.
  • గోదావరిలో ఎగువన మహారాష్ట్రలోని జైక్వాడిలోకి 70 టీఎంసీలు అవసరం. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టుకు ప్రాణహిత నుంచి 1250 క్యూసెక్కులు వస్తుండగా, వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని