
వరి పంటపై భాజపా చలిమంటలు
మోదీ ధాన్యం కొంటామంటే మేం వద్దంటామా?
సిరిసిల్ల ధర్నాలో మంత్రి కేటీఆర్
ఈనాడు డిజిటల్ - సిరిసిల్ల
సిరిసిల్లలో జరిగిన మహాధర్నాలో ప్లకార్డు ప్రదర్శిస్తున్న మంత్రి కేటీఆర్
భాజపా నాయకులారా..! నడిచినన్ని రోజులు మీ డ్రామాలు నడుస్తాయి.. ఒకసారి రైతులు తిరగబడితే వారి ఎడ్లబండ్లు.. ట్రాక్టర్ల కింద మీ పార్టీ నలిగిపోతుంది.
‘‘స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా.. ఇంకా దేశం ఆకలి రాజ్యాల జాబితాలో ముందు వరుసలో ఉంది. యూరప్‌నకు చెందిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ సర్వే సంస్థ అక్టోబరులో విడుదల చేసిన ఆకలి రాజ్యాల జాబితాలో 116 దేశాలు ఉండగా, మన దేశం 102వ స్థానంలో ఉంది. మన పక్కనున్న పాకిస్థాన్ 92, నేపాల్, బంగ్లాదేశ్‌లు 76వ స్థానాల్లో ఉన్నాయి. కేంద్రానికి కొంచెం కూడా అవమానంగా లేదా? అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ ఉన్నట్లు ప్రపంచంలోని మిగతా దేశాల ముందు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితిలో ఉంచారు’’
-కేటీఆర్
‘వడ్లు కొనబోమని కేంద్రం చెబుతోంటే వరి సాగు చేయాలని రాష్ట్ర భాజపా నాయకులు అంటున్నారు. కేంద్రం ఆదేశాలను మేం పాటిస్తుంటే వారు కావాలని తొండిపెట్టి వరిపంటపై చలిమంటలు పెట్టి ఓట్ల రాజకీయం చేస్తున్నారు’ అని రాష్ట్ర మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెరాస చేపట్టిన రాష్ట్రవ్యాప్త ఆందోళనల్లో భాగంగా సిరిసిల్లలో శుక్రవారం జరిగిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు.
‘‘రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను సూటిగా అడుగుతున్నాం. మీ మోదీ వరి కొంటామంటుంటే, మేం వేయొద్దు అంటున్నామా? మీ పీయూష్ గోయల్ యాసంగిలో వడ్లు కొంటామంటే మేం వద్దంటున్నామా? కొనబోమని చెబుతున్న మీరే.. వరి పండించాలని అంటున్నారు. బండి సంజయ్ కాదు..తొండి సంజయ్’’ అన్నారు. కేంద్రం తీరుపైనా ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘రైతేడ్చిన రాజ్యం.. ఎద్దేడ్చిన ఎవుసం బాగుపడదు’.. దశాబ్దాలకు పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించిన రైతు వ్యతిరేక విధానాలకు తిలోదకాలిచ్చి... ప్రత్యేక రాష్ట్రంలో ఒక నూతన అధ్యయనానికి తెరతీశామన్నారు. ఏడున్నరేళ్లు వెనక్కి వెళ్లి చూస్తే... విత్తనాలు, ఎరువులను పోలీస్స్టేషన్లలో పెట్టి పంపిణీ చేసిన దుస్థితి ఉండేదన్నారు. వ్యవసాయానికి ఇచ్చే ఆరు గంటల విద్యుత్తు ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోతదో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. ప్రాజెక్టులు నిర్మించక రాష్ట్రంలో దిక్కుమాలిన పాలన కొనసాగించారని విమర్శించారు. తెలంగాణ ఏర్పడ్డాక వ్యవసాయానికి 24 గంటలూ విద్యుత్తు అందిస్తున్నామన్నారు. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా ముందస్తుగా నిల్వలు సమకూర్చుతున్నట్లు వెల్లడించారు. మన రాష్ట్రాన్ని చూసి 13 రాష్ట్రాల్లో ఇక్కడి పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. కాలంతో పోటీపడి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో కొత్తగా లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. వరి దిగుబడుల్లో రాష్ట్రం పంజాబ్‌ను దాటిపోయిందన్నారు. దేశానికి అన్నపూర్ణగా నిలిచిందన్నారు. ఇది రాష్ట్ర రైతన్నల విజయంగా అభివర్ణించారు. కేంద్రానికి మాత్రం ఇక్కడి పంటలపై సోయిలేకుండా పోయిందని ఎద్దేవా చేశారు.
మనం జై కిసాన్ అంటే... కేంద్రం నై కిసాన్ అంటోంది
రాష్ట్రాలు పంటలు పండిస్తే వాటిని కొనుగోలు చేసి దేవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సమానంగా పంపిణీ చేయాలనేది రాజ్యాంగంలోనే పొందుపరిచారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కొనుగోలు చేసే అధికారం లేదని, ఎగుమతుల అంశం కేంద్రం పరిధిలోనే ఉందని చెప్పారు. కేంద్రం మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలను ధాన్యం సేకరణలో బాధ్యులను చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. యాసంగిలో అధిక ఉష్ణోగ్రతలతో ముడి బియ్యం ఎక్కువగా నూకగా మారుతాయని, ఉప్పుడు బియ్యం ఇస్తామంటే నిరాకరిస్తోందన్నారు. మనం ‘జై కిసాన్ అంటే కేంద్రం నై కిసాన్’ అంటోందన్నారు. జడ్పీ ఛైర్పర్సన్ న్యాలకొండ అరుణ, నాఫ్స్కాబ్ ఛైర్మన్ కొండూరి రవీందర్రావు, పలువురు ప్రజాప్రతినిధులు, తెరాస నేతలు పాల్గొన్నారు.
ప్రభుత్వమే వస్త్ర పరిశ్రమను బతికించాలంటే కష్టం: కేటీఆర్
సిరిసిల్ల పట్టణం, న్యూస్‌టుడే: ప్రభుత్వమే వందశాతం బాధ్యత తీసుకొని వస్త్ర పరిశ్రమను బతికించాలంటే కష్టమని పురపాలకశాఖ మంత్రి కె.టి.రామారావు పేర్కొన్నారు. ప్రపంచంతో పోటీపడేలా ఎప్పటికప్పుడు కార్మికులు, యజమానులు పరిశ్రమను మెరుగుపర్చుకోవాలని సూచించారు. శుక్రవారం సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు.తిర్పూర్, కోయంబత్తూర్‌లతో పోటీ పడాలన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Weather Report: తెలంగాణలో మూడు రోజులు వర్షాలు
-
India News
Bypoll Results: రెండు లోక్‌సభ స్థానాల్లో ఉత్కంఠ.. భాజపా, ఎస్పీల మధ్య హోరాహోరీ
-
General News
Telangana News: 19 లక్షల రేషన్‌కార్డుల రద్దుపై దర్యాప్తు చేయండి: ఎన్హెచ్ఆర్సీకి బండి సంజయ్ ఫిర్యాదు
-
Movies News
Cash Promo: ఏం మిస్ అయ్యానో ఇప్పుడు తెలుస్తోంది: గోపీచంద్
-
Crime News
Hyderabad: బాలికతో పెళ్లి చేయట్లేదని.. డీజిల్ పోసుకొని సజీవదహనం
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- మా ఆయన కోసం సల్మాన్‌ఖాన్‌ని వదులుకున్నా!
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి
- Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్‌స్టేషన్‌లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
- ప్రశ్నించానని పాలు, నీళ్లు లేకుండా చేశారు
- AP Liquor: మద్యంలో విషం
- Teesta Setalvad: పోలీసుల అదుపులో తీస్తా సీతల్వాడ్
- Rohit Sharma: టీమ్ఇండియాకు షాక్.. రోహిత్ శర్మకు కరోనా
- AP sachivalayam: జులై 1 నుంచి ప్రొబేషన్
- New Labour codes: వారానికి 4 రోజులే పని.. తగ్గనున్న చేతికొచ్చే వేతనం.. జులై 1 నుంచి కొత్త రూల్స్..!