ఇది 2020: అందుకే ఇంటికి నల్లటి పెయింటింగ్‌

ఇది 2020వ సంవత్సరం.. ఎన్నో భయంకరమైన సంఘటనలకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. కరోనా విలయ తాండవం చేయగా.. వరదలు, తుపాన్లతో...

Updated : 02 Dec 2020 17:17 IST

వేయించిన అమెరికాకు చెందిన ప్రొడక్షన్ డిజైనర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇది 2020వ సంవత్సరం.. ఎన్నో భయంకరమైన సంఘటనలకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. కరోనా విలయ తాండవం చేయగా.. వరదలు, తుపాన్లతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. అదే విధంగా ఎంతో మంది రాజకీయ, క్రీడా ప్రముఖులు కన్నుమూశారు. మరి అలాంటి సంవత్సరాన్ని ఎవరైనా మరిచిపోగలమా..? దీనికి గుర్తుగా అమెరికాకు చెందిన ఓ ప్రొడక్షన్‌ డిజైనర్‌ తన ఇంటికి నలుపు రంగుతో పెయింట్ చేయించింది. అకాడమీ అవార్డు విజేత హన్నా బీచ్లర్‌ తన ఇంటికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచింది. నాలుగు రోజుల కిందటి పోస్ట్‌కు లక్షన్నరకుపైగా లైకులు, భారీగా కామెంట్లు వచ్చాయి. రెడ్‌ డ్రస్‌, మాస్కు ధరించిన హన్నా నల్లటి  పెయింటింగ్‌ వేసిన ఇంటి ఎదుట నిల్చున్న ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేసింది. ‘బ్లాకిటీ బ్లాక్‌ బ్లాక్’ అంటూ ఫొటోలకు క్యాప్షన్‌ను జోడించింది. దీనికి ఫిదా అయిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లను పెట్టారు. మరి ఆ ఫొటోలను మీరూ చూసేయండి.. 



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని