Published : 01 Dec 2020 22:28 IST

‘మీర్జాపూర్‌’ త్రిపాఠి హావభావాలే జవాబు

ట్విటర్‌లో షేర్‌ చేసిన ముంబయి పోలీస్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మీర్జాపూర్‌’ వెబ్‌ సిరీస్‌ ఓటీటీ రంగంలో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అందులోని ప్రధాన పాత్రధారి అఖండానంద్‌ త్రిపాఠిగా పంకజ్‌ త్రిపాఠి ప్రేక్షకులను మెప్పించారు. మీర్జాపూర్‌ వెబ్‌ సిరీస్‌లో శృంగారం, అసభ్యకరమైన డైలాగులు ఉన్నాయంటూ విమర్శలూ రావడం గమనార్హం. అయితే ముంబయి పోలీసులు మాత్రం అఖండానంద్‌ త్రిపాఠి పాత్రధారి హావభావాలను ఓ చిన్నపాటి వీడియోగా చేసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. ఎందుకో తెలుసుకోవాలంటే మాత్రం ముంబయి పోలీస్‌ ట్విటర్‌ను ఓపెన్‌ చేయాల్సిందే. సైబర్‌ సెక్యూరిటీకి సంబంధించి ప్రజలను అప్రమత్తం చేసేలా వివిధ సందర్భాల్లో తల ఊపుతున్న త్రిపాఠి హావభావాలను ముంబయి పోలీస్‌ శాఖ ట్వీట్ చేసింది. 
 

మోసగాళ్లు: కంగ్రాట్స్‌! మీకు ఆన్‌లైన్‌లో రూ.కోటి లాటరీ తగిలింది. అకౌంట్ ఖాతా వివరాలను పంపించగలరు. 
బాధ్యతాయుతమైన పౌరులు: అలాకాదు గానీ.. నిన్ను వెంటనే బ్లాక్‌ చేసి 100కి ఎందుకు ఫోన్‌ చేయకూడదు’’ అంటూ పోలీస్‌శాఖ క్యాప్షన్‌ను జోడించింది. ఈ ట్వీట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. సూపర్‌, ఫర్‌ఫెక్ట్‌ అంటూ ఎమోజీలతో కామెంట్లు పెట్టారు. మరి ఆ వీడియో ఏంటో మీరూ ఓసారి చూసేయండి..


Read latest Viral videos News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని