పిల్లిలా పాకుతూ వచ్చాడు.. పిల్లి కంట పడ్డాడు

సరదాగా పెంపుడు జంతువులను పెంచుకోవడం చాలా మందికి అలవాటు.  కొంతమంది కుక్కలు, పిల్లులు, చిలుకలు, ఉడతలు, కుందేళ్లు...

Published : 27 Oct 2020 15:31 IST

వైరల్‌గా మారిన వీడియో మీకోసం...

ఇంటర్నెట్‌ డెస్క్‌: సరదాగా పెంపుడు జంతువులను పెంచుకోవడం చాలా మందికి అలవాటు. కొంతమంది కుక్కలు, పిల్లులు, చిలుకలు, ఉడతలు, కుందేళ్లు, పంది పిల్లలు వంటి వాటిని పెంచుకుంటారు. ఇంటికి కాపలాగా ఉంటుందనే ఉద్దేశంతో ఎక్కువ మంది కుక్కలను పెంచుకోవడానికే మొగ్గు చూపుతారు. అయితే ఇక్కడ ఓ పెంపుడు పిల్లి కూడా తానేం తక్కువ కాదని నిరూపించుకుంది. ఇంగ్లాండ్‌లోని నాటింగ్‌హామ్‌ పోలీసులు విడుదల చేసిన ఓ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది. ఇంటిని దోచేద్దామని ఓ దొంగ చాకచక్యంగా పిల్లిలా పాకుకుంటూ ఇంటి ఆవరణలోకి ప్రవేశించాడు. తలుపు దగ్గరకు వెళ్లి తెరుద్దామనుకునేసరికి అటువైపు ఠీవీగా పిల్లి కూర్చొని చూస్తూ ఉంది. అంతే కాపలాదారుని చూసి వచ్చిన దారినే పలాయనం చిత్తగించడం దొంగ వంతైంది. ఇదంతా ఇంటి ఆవరణలోని సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. ఈ వీడియోను మీరూ చూసేయండి.. మరి



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని