ఎగిరే దోశ తర్వాత ఇక రజనీ స్టైల్‌ దోశ!

స్టార్‌ హోటళ్లలో శిక్షణ పొందిన షెఫ్‌లు వండిన వంట రుచికరంగా, ప్రత్యేకంగా ఉండటం మామూలే

Updated : 23 Feb 2021 18:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టార్‌ హోటళ్లలో శిక్షణ పొందిన షెఫ్‌లు వండిన వంట రుచికరంగా, వడ్డించే విధానం అతి ప్రత్యేకంగా ఉండటం మామూలే. మరి ఏ శిక్షణా లేకుండానే  మనకు కోరిన ఆహార పదార్ధాలను అందచేసే చిరు వ్యాపారులు, వంటవారిలోనూ టాలెంట్‌కు కొదవ లేదని సామాజిక మాధ్యమాల్లో, బయటా కూడా అనేకమార్లు  నిర్ధారణ అవుతూనే ఉంది.
గాలిలో ఎగరేసి ప్లేటులోకే తిన్నగా దోశను పంపే ముంబయి దోశ వ్యాపారి  నైపుణ్యానికి ఫిదా అయిన నెటిజన్లను ఇపుడు రజనీ కాంత్‌ స్టైల్‌ దోశ అలరిస్తోంది.
ముంబయికే చెందిన మరో ఫుడ్‌ స్టాల్‌ ‘ముత్తు దోశ కార్నర్‌’. దాదర్‌ ప్రాంతంలో ఉన్న ఈ  బండి వద్ద దొరికే రుచికరమైన మసాలా దోశను తినేందుకు ఎంతోమంది వస్తూ ఉంటారు. వారందరి కోసం ఆ హోటల్‌ బండి యజమాని ముత్తు తనదైన స్టైల్‌లో దోశెను తయారు చేయటం, కట్‌ చేసి, ప్లేటులోకి పంపించటం.. ఇదంతా కనురెప్పపాటులో అయిపోతుంది.

దీనిని సంబంధించిన వీడియోను నెట్టింట్లో చూసిన వారు ముత్తు దక్షిణ భారత సూపర్‌ స్టార్‌, తలైవా రజనీకాంత్‌ అభిమాని అయిఉంటాడని.. అందుకే ఈ వేగం సాధ్యమైందని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.   ముత్తు అంకుల్‌  దోశ కంటే రుచికరమైనదాని కోసం చిన్నప్పటి నుంచి ముంబయి అంతా తిరిగినా దొరకలేదనీ అంటున్నారు. అంతేకాకుండా దోశను క్యాచ్‌ పట్టిన వ్యక్తి కూడా ప్రయత్నిస్తే మంచి వికెట్‌ కీపర్‌ అవొచ్చని కూడా కామెంట్లు పెడుతున్నారు. మరి అదెంత నిజమో ఈ వీడియో చూసి మీరే చెప్పండి..



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని