శ్మశానవాటిక ముందు మృతదేహాలతో క్యూ!

కరోనా రెండో వేవ్‌ ఉద్ధృతితో ఆసుపత్రులే కాదు.. శ్మశానవాటికలు కూడా నిండిపోతున్నాయి. అంత్యక్రియల కోసం క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కరోనా కట్టడికి దిల్లీ ప్రభుత్వం విధించిన ఆంక్షల నేపథ్యంలో దహన సంస్కారాలు ఆలస్యమై భారీ సంఖ్యలో మృతదేహాలు ఓ శ్మశానవాటిక....

Published : 17 Apr 2021 13:40 IST

ఘజియాబాద్‌: కరోనా రెండో వేవ్‌ ఉద్ధృతితో ఆసుపత్రులే కాదు.. శ్మశానవాటికలు కూడా నిండిపోతున్నాయి.  అంత్యక్రియల కోసం క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కరోనా కట్టడికి దిల్లీ ప్రభుత్వం విధించిన ఆంక్షల నేపథ్యంలో దహన సంస్కారాలు ఆలస్యమై భారీ సంఖ్యలో మృతదేహాలు ఓ శ్మశానవాటిక వెలుపలే నిలిచిపోయాయి. ఘజియాబాద్‌లోని హిండన్‌ శ్మశానవాటికలో కనిపించిన ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 

భౌతిక దూరంలో భాగంగా ఒకసారి ఐదు మృతదేహాలను మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు. ఫలితంగా అంతకుమించి మృతదేహాలు శ్మశానవాటికకు వస్తే బయటనే నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది. శుక్రవారం ఒక్కరోజే అధికసంఖ్యలో మృతదేహాలు రావడంతో వాటిని బయటనే వరుసగా పెట్టారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని