Viral Video: కొవిడ్‌ ఎరా బేబీ!

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చేతులు శుభ్రం చేసుకోమని నిపుణులు సూచించారు. తరచుగా చేతులు

Published : 16 Jul 2021 22:47 IST

ఇంటర్నెట్ డెస్క్: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చేతులు శుభ్రం చేసుకోమని నిపుణులు సూచించారు. తరచుగా చేతులు శానిటైజ్‌ చేసుకోమని సలహా ఇచ్చారు. అయితే అదిప్పుడు ప్రతిఒక్కరికీ అలవాటుగా మారింది. ఆ ప్రభావం పిల్లల మీద కూడా పడింది. అందుకు నిదర్శనమే ఈ వీడియో. 

చేతులతో తాకకుండానే శానిటైజర్‌ చేతిలో పడేలా ఆటోమెటిక్‌ శానిటైజర్‌ డిస్పెన్సర్లను ప్రస్తుతం విరివిగా వినియోగిస్తున్నారు. వాటి కింద చేయి పెడితే చేతిలో శానిటైజర్‌ పడుతుంది. దాంతో చేతులు శానిటైజ్‌ చేసుకోవచ్చు. ఇది గమనించిన ఓ చిన్నారి కనిపించిన ప్రతి పెట్టెలాంటి నిర్మాణాన్ని శానిటైజర్‌ డిస్పెన్సర్‌ అనుకుని దాని కింద చేతులు పెడుతోంది. తర్వాత శానిటైజర్‌ రాసుకున్నట్టు చేతులను రుద్దుకుంటోంది. దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఆ వీడియో మీరూ చూసేయండి..



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని