viral video: ఇదెక్కడి పైత్యం! నిప్పంటించుకొని వివాహ ఫొటో షూట్‌.. వైరల్‌ వీడియో

నేటితరం యువతలో చాలా మంది ప్రతి విషయంలో కొత్తదనం కోరుకుంటున్నారు. ఫోటో షూట్‌ల దగ్గరినుంచి పెళ్లి వరకు కొత్తగా ఉండాలని తహతహలాడుతున్నారు......

Published : 13 May 2022 17:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నేటితరం యువతలో చాలా మంది ప్రతి విషయంలో కొత్తదనం కోరుకుంటున్నారు. ఫొటో షూట్‌ల దగ్గరి నుంచి పెళ్లి వరకు కొత్తగా ఉండాలని తహతహలాడుతున్నారు. మరికొందరైతే అత్యుత్సాహంతో వింత పోకడలు ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఓ వివాహ వేడుక చర్చనీయాంశమైంది. వధూవరులిద్దరూ నిప్పంటించుకొని ఫొటో షూట్‌లో పాల్గొనడం వైరల్‌గా మారింది.

హాలీవుడ్‌లో స్టంట్‌ మాస్టర్లుగా పనిచేసే గేబ్‌ జోసెఫ్‌, ఆంబ్రీ బాంబ్రీ మిచెల్లే ఈ మధ్యే వివాహం చేసుకున్నారు. అయితే తమ వివాహ ఎంట్రీ సీన్‌ అందరిలా ఉండకూడదని భావించిన వీరు ఎవరూ చేయనట్లు కొత్తగా ఉండాలనుకున్నారు. ఉంగరాలు మార్చుకున్న అనంతరం ఇరువురు తమ వీపులకు నిప్పంటించుకొని ఎంట్రీ ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. ఇరువురు కొద్దిదూరం పరుగెత్తుకుంటూ వచ్చిన తర్వాత వారివెంటే ఉన్న సహాయకులు ఆ మంటలను ఆర్పివేశారు. ఫొటోగ్రాఫర్‌ పావెల్‌ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా వైరల్‌గా మారింది.

అయితే అన్ని చర్యలు తీసుకొనే వధూవరులు ఈ సాహసం చేసినప్పటికీ.. పెళ్లి వేడుకలో ఇలాంటివి ఏంటని అనేక మంది ప్రశ్నిస్తున్నారు. ఇదెక్కడి పైత్యం అంటూ చాలా మంది నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటివి ప్రయత్నించవద్దంటూ ఇతరుల్ని కోరుతున్నారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని