Viral: కార్నివాల్‌లో తప్పిన పెను ప్రమాదం

అమెరికాలోని మిచిగాన్‌లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. నేషనల్ చెర్రీ ఫెస్టివల్ సందర్భంగా ఓ కార్నివాల్‌లో ఏర్పాటు చేసిన అమ్యూజ్ మెంట్ రైడ్ ఔత్సాహికులకు చేదు అనుభవం మిగిల్చింది....

Updated : 07 Dec 2022 13:53 IST

మిచిగాన్‌: అమెరికాలోని మిచిగాన్‌లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. నేషనల్ చెర్రీ ఫెస్టివల్ సందర్భంగా ఓ కార్నివాల్‌లో ఏర్పాటు చేసిన అమ్యూజ్ మెంట్ రైడ్ ఔత్సాహికులకు చేదు అనుభవం మిగిల్చింది. ఈ మ్యాజిక్ కార్పెట్ రైడ్ ఎక్కి సందర్శకులు కేరింతలు కొడుతున్న క్రమంలో దాని కింది భాగం దాదాపు ఊడిపోయింది. తీవ్ర భయాందోళనలకు గురైన అందులో ఉన్నవారు అరవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ యంత్రం కింది భాగంపై నిలబడ్డాడు. అతడిని అనుసరిస్తూ మరికొందరు ఆ యంత్రంపై నిలబడగా అది పడిపోకుండా ఉన్నచోటే నిలబడింది. ఫలితంగా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ దృశ్యాలను అక్కడున్నవారు ఫోన్లలో చిత్రీకరించగా.. అవి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు