భుజంపై బిడ్డను జో కొడుతూ..ట్రాఫిక్‌ కంట్రోల్‌ చేస్తూ..! 

సాధారణంగా కార్యాలయాల్లో ఉద్యోగులు వారితో పాటు చంటి పిల్లలను కూడా ఆఫీస్‌కు తీసుకొస్తుంటారు. అయితే ఆఫీస్‌లో పని చేసే ఉద్యోగులకు వారితో పిల్లలు ఉంటే భారం కాకపోవచ్చు. కానీ ఇక్కడ ఓ ట్రాఫిక్‌ పోలీస్ ‌అధికారిని ..

Published : 07 Mar 2021 20:15 IST

మహిళా కాప్‌ ట్రాఫిక్‌ విధులు.. వీడియో వైరల్‌

చండీగఢ్‌: సాధారణంగా కార్యాలయాల్లో ఉద్యోగులు కొన్నిసార్లు వారితో పాటే చంటి పిల్లలను కూడా తీసుకొస్తుంటారు. ఒకవైపు పనిచేసుకుంటూ మరోవైపు పిల్లల్ని చూసుకోవడం వాళ్లకు భారం కాకపోవచ్చు. కానీ, ఇక్కడ ఓ ట్రాఫిక్‌ పోలీస్ ‌అధికారిని తన బిడ్డను భుజాలపై ఎత్తుకొని మరీ రోడ్డుపై విధులు నిర్వహిస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అదేంటో చూడండి.. పంజాబ్‌లోని చండీగఢ్‌కు చెందిన ప్రియాంక గత కొద్ది రోజులుగా ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారినిగా విధులు నిర్వహిస్తోంది. అయితే తన చంటి బిడ్డను చూసుకోవడానికి ఎవరూ లేరేమో గానీ.. ఆమె తన భుజాలపై బిడ్డను ఎత్తుకొని రహదారిపై ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేస్తున్నట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. 

అయితే అటుగా వెళ్తున్న ప్రయాణికుడు ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు వేల సంఖ్యలో వీక్షణలు వచ్చాయి. ‘ఆమె తన భుజాలపై బిడ్డను ఎత్తుకొని బాధ్యతగా విధులు నిర్వహిస్తోంది. పిల్లలపై తల్లి ప్రేమకు ఇది నిదర్శనం’ అని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే కొంతమంది ఆ అధికారిని పనిని వ్యతిరేకిస్తూ.. భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు. ‘రహదారిపై కాలుష్యం వల్ల బిడ్డకు అపాయం జరుగుతుంది. ఇది గమనించి విధుల సమయంలో చంటి పిల్లలను వెంట తీసుకురావద్దు. ఆమె చేసిన పనిని వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వ కార్యాలయాల్లో చంటి పిల్లలకు సంరక్షణ లేదని’ కామెంట్స్‌ చేస్తున్నారు. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని