చిరుత-మొసలి పోట్లాట చూశారా?

అడవి.. ఎన్నో వింతలకు, సాహసాలకు చిరునామా. ప్రాణాలు కాపాడుకునేందుకు వన్యప్రాణుల మధ్య పోట్లాటలు, ఆహారం కోసం వేటాడటం ఇక్కడి జంతువుల నిత్యకృత్యం.

Published : 31 May 2021 15:07 IST

          

అడవి.. ఎన్నో వింతలకు, సాహసాలకు చిరునామా. ప్రాణాలు కాపాడుకునేందుకు వన్యప్రాణుల మధ్య పోట్లాటలు, ఆహారం కోసం వేటాడటం ఇక్కడి జంతువుల నిత్యకృత్యం. అందుకే చురుగ్గా ఉండే ప్రాణే ఇక్కడ మనుగడ సాగిస్తుందని అంటుంటారు. దీన్ని రుజువు చేసే వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నీరు తాగేందుకు ఓ చిరుత సరస్సు వద్దకు వచ్చింది. నీటిలోపల మాటువేసి ఉన్న మొసలి ఒక్కసారిగా దాడి చేసేందుకు యత్నించింది. ఉలిక్కిపడ్డ చిరుత అమాంతం గాల్లోకి ఎగిరి రెప్పపాటులో అక్కడి నుంచి ఉడాయించింది. ఈ వీడియోను సురేందర్ మెహ్రా అనే ఐ.ఎఫ్‌.ఎస్‌. అధికారి ట్విటర్‌లో షేర్ చేశారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని