Viral: పులిని ముప్పుతిప్పలు పెట్టిన బాతు

పులి కంటపడితే ఎంతటి  మృగమైన సరే.. పరుగులుపెట్టాల్సిందే. అలాంటి  పులిని చూసి ఓ బాతు భయపడలేదు సరికదా.. ఏకంగా దాన్ని ముప్పు తిప్పలు పెట్టింది....

Published : 06 Jun 2021 14:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పులి కంటపడితే ఎంతటి  మృగమైన సరే.. పరుగులుపెట్టాల్సిందే. అలాంటి  పులిని చూసి ఓ బాతు భయపడలేదు సరికదా.. ఏకంగా దాన్ని ముప్పు తిప్పలు పెట్టింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో నవ్వులు పూయిస్తోంది. చిన్న బాతే కదా.. చటుక్కున్న ఆరగించేద్దామని నీటిలోకి దిగిన పులిని ఆ బాతు ఓ ఆట ఆడుకున్న దృశ్యాలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. పులిని తనవైపునకు ఆకర్షిస్తూనే.. అంతలోనే నీటిలోకి మునిగి చాకచక్యంగా తప్పించుకుంటున్న బాతు తెలివిని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ వీడియోను మీరూ చూసేయండి..



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని