Published : 26 May 2021 23:24 IST

Viral: శునకాన్ని అమాంతం మింగేసిన మొసలి

కోటా: నీటిలో ఉండే మొసలి కదలికలను అంచనా వేయడం చాలా కష్టం. ఈ విషయం తెలియని ఓ శునకం దానికి ఆహారంగా మారిన ఘటన రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో జరిగింది. చంబల్ నది ఒడ్డున నిల్చొని నీరు తాగుతున్న శునకాన్ని ఓ మొసలి క్షణాల్లో ఒడిసి పట్టింది. ఆపై వెంటనే నీటిలోకి లాక్కెళ్లి దాని ప్రాణాలను హరించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రానా ప్రతాప్‌ సాగర్ ఆనకట్టలో పెద్ద సంఖ్యలో మొసళ్లు ఉండగా నీటి లోపలి ఎండవేడిని తట్టుకోలేక అవి తరచూ ఒడ్డుకు వచ్చి సేద తీరుతుంటాయని డ్యామ్ ఇన్‌ఛార్జి పేర్కొన్నారు.


Read latest Viral videos News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని