Viral: ఒత్తిడిని అధిగమించేందుకు వైద్యుల నృత్యాలు

కరోనా వేళ వైద్యులపై పడుతున్న ఒత్తిడిని అధిగమించేందుకు ఉత్తరప్రదేశ్‌ని ఫిరోజాబాద్ కొవిడ్ ఆస్పత్రి వైద్యులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు....

Updated : 22 Dec 2022 15:37 IST

ఫిరోజాబాద్‌: కరోనా వేళ వైద్యులపై పడుతున్న ఒత్తిడిని అధిగమించేందుకు ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ కొవిడ్ ఆస్పత్రి వైద్యులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కొవిడ్ వార్డుల్లో గంటల కొద్ది గడుపుతూ తీవ్ర అలసటకు గురైన కొందరు వైద్యులు నృత్యం చేస్తూ ఉపశమనం పొందుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. పీపీఈ కిట్లతో వైద్య బృందం చేస్తున్న డ్యాన్సులు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇలా చేయటం ద్వారా తీవ్ర ఒత్తిడి నుంచి బయటపడటమే కాకుండా.. మానసికంగా దృఢంగా ఉండేందుకు దోహదపడుతుందని వైద్యులు తెలిపారు. తద్వారా మరింత సమర్థవంతంగా చికిత్స అందించేందుకు వీలుపడుతుందని పేర్కొన్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని