Viral Video: పెయింటింగ్‌ వేస్తోన్న ఏనుగు

థాయ్‌ల్యాండ్‌లోని నాంగ్‌ తన్వా అనే 9 ఏళ్ల ఏనుగు పెయింటింగ్‌ వేస్తూ అందరినీ

Published : 09 Jul 2021 23:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: థాయ్‌లాండ్‌లోని నాంగ్‌ తన్వా అనే 9 ఏళ్ల ఏనుగు పెయింటింగ్‌ వేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. శిక్షకుడి సాయంతో తొండంతో కుంచె పట్టుకొని చక్కగా రంగులు అద్దుతోంది. ఇప్పటికే ఈ ఏనుగు వేసిన ఓ పెయింటింగ్‌ నాలుగు లక్షలకు అమ్ముడుపోయింది. న్యూయార్క్‌కు చెందిన ఓ వార్తా సంస్థ ఏనుగు పెయింటింగ్‌ వేస్తున్న వీడియోను ట్విటర్‌ ద్వారా పంచుకోగా ఆ దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. కాగా ఈ వీడియో చూసిన నెటిజన్లు ఏనుగును హింసించి పెయింటింగ్‌ వేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియోను సామాజిక మాధ్యమాలనుంచి తొలగించాలని కోరుతున్నారు.  



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని