Uttar Pradesh:ఆఫీసులో ఫైలును ఎత్తుకెళ్లిన మేక..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ప్రభుత్వ కార్యాలయానికి వచ్చిన.. ఓ మేక అక్కడి అధికారులకు షాక్ ఇచ్చింది. చౌబేపూర్ పంచాయతీ కార్యాలయంలోకి ప్రవేశించి..

Published : 02 Dec 2021 23:33 IST

కాన్పుర్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ మేక అక్కడి అధికారులకు షాక్ ఇచ్చింది. చౌబేపూర్ పంచాయతీ కార్యాలయంలోకి ప్రవేశించి.. అక్కడ బల్ల పైనున్న ఫైలును నోట కరుచుకొని బయటకు వచ్చింది. అది గమనించిన కార్యాలయ సిబ్బంది మేకను పట్టుకునేందుకు ప్రయత్నించగా.. అది పరుగందుకుంది. సిబ్బంది చేతికి చిక్కకుండా ముప్పుతిప్పలు పెట్టింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్  మారాయి.

Read latest Viral Videos and Telugu News



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని