Viral video: సీతాకోకచిలుకతో పెంగ్విన్‌ల ఆటలు.. వావ్‌ అనిపించే ఈ వీడియో చూశారా?

సీతాకోకచిలుకతో పెంగ్విన్లు ఆటలాడుతున్న ఓ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఓ పెంగ్విన్ల గుంపు గెంతుతూ......

Published : 05 Jun 2022 22:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సీతాకోకచిలుకతో పెంగ్విన్లు ఆటలాడుతున్న ఓ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఓ పెంగ్విన్ల గుంపు గెంతుతూ.. సీతాకోకచిలుక వెంటపడటం చూడముచ్చటగొలుపుతోంది.  ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి తన కెమెరాలో బంధించాడు. పదికిపైగా ఉన్న ఓ పెంగ్విన్ల బృందం ఓ సీతాకోకచిలుక వెంటపడటం ఆ వీడియోలో కనిపిస్తుంది.

సదరు వీడియోను ట్విటర్‌లో పంచుకోగా.. ఇప్పటికే 3.3 మిలియన్ల మంది వీక్షించారు. 152.8వేల మంది లైక్‌ చేశారు. ‘ఆ సీతాకోకచిలుక తన ఎగిరే సామర్థ్యంతో పెంగ్విన్‌లను ఎగతాళి చేస్తోంది’ అంటూ ఓ నెటిజన్‌ సరదాగా వ్యాఖ్యానించాడు. పెంగ్విన్లు ఏం చేసినా అందంగానే ఉంటుంది అని మరికొందరు ట్వీట్‌ చేశారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని