బోటుపై చేప దాడి.. వైరల్‌ వీడియో

కర్ణాటక రాష్ట్రం మంగళూరు తీరంలో చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకారులకు ఓ చేప నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. సముద్రంలో బోటు వెళుతున్న మార్గానికి అడ్డుపడిన ఆ మత్స్యం కాసేపు వారిని భయాందోనకు గురిచేసింది....

Updated : 17 Feb 2021 11:58 IST

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం మంగళూరు తీరంలో చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకారులకు ఓ చేప నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. సముద్రంలో బోటు వెళుతున్న మార్గానికి అడ్డుపడిన ఆ మత్స్యం కాసేపు వారిని భయాందోళనలకు గురిచేసింది. తన పదునైన ముట్టెతో బోటుపై పలుమార్లు దాడి చేసింది. ఈ క్రమంలో ఆ చేపకు గాయాలైనా వెనుదిరగలేదు. దీంతో బోటు వేగాన్ని పెంచిన మత్స్యకారులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. చేప దాడిలో బోటు స్వల్పంగా దెబ్బతిన్నట్లు వారు తెలిపారు. దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇవీ చదవండి...

పొలానికి హెలికాప్టర్‌లో వెళ్లాలి.. రుణం ఇప్పించండి

ప్రేమికుల దినోత్సవానికి ప్రత్యేక కానుక



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని