ఆ దుకాణంలో భారీ అడవి బల్లి: వైరల్‌ వీడియో

థాయ్‌లాండ్‌లోని ఓ దుకాణానికి ఊహించని అతిథి వచ్చి భయాందోళనలు సృష్టించింది. ఓ దుకాణంలోకి చొరబడ్డ భారీ అడవి బల్లి బయటికి వెళ్లే దారి లేక అక్కడే అటూఇటూ తిరిగింది. సుమారు ఆరు అడుగుల పొడవున్న ఈ అడవి బల్లి....

Published : 10 Apr 2021 17:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: థాయ్‌లాండ్‌లోని ఓ దుకాణానికి ఊహించని అతిథి వచ్చి భయాందోళనలు సృష్టించింది. లోపలికి చొరబడ్డ భారీ అడవి బల్లి బయటికి వెళ్లే దారి లేక అక్కడే అటూ ఇటూ తిరిగింది. సుమారు ఆరు అడుగుల పొడవున్న ఈ అడవి బల్లి.. సిబ్బంది అరుపులకు భయపడి షెల్ఫ్  పైకి ఎక్కింది. సమాచారం అందుకున్న అధికారులు అక్కడకు చేరుకొని అడవి బల్లిని పట్టుకుని జంతుప్రదర్శనశాలకు తరలించారు. అక్కడి అటవీ ప్రాంతాల్లో ఇలాంటి బల్లులు సంచరిస్తాయని అధికారులు పేర్కొన్నారు. దుకాణంలో అడవి బల్లి హల్‌చల్ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని