viral video: బూట్లలో దూరిన పాము!

బూట్లు వేసుకుంటుండగా అందులోకి దూరిన పామును చూసి ఖంగుతిన్నాడు ఓ వ్యక్తి. ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన రవీంద్ర అనే వ్యక్తి బూట్లు ధరించేందుకు వాటిని తీయగా..

Published : 08 Nov 2021 13:23 IST

భువనేశ్వర్: బూట్లు వేసుకుంటుండగా అందులోకి దూరిన పామును చూసి ఖంగుతిన్నాడు ఓ వ్యక్తి. ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన రవీంద్ర అనే వ్యక్తి బూట్లు ధరించేందుకు వాటిని తీయగా.. అందులో పాము కనిపించింది. పామును చూసి భయపడిన రవీంద్ర వెంటనే పాములు పట్టే వ్యక్తిని రప్పించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పాములు పట్టే వ్యక్తి.. చాకచక్యంగా దాన్ని పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని