#PETROL100: సోషల్‌మీడియాలో ఫన్నీ మీమ్స్‌!

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగ్గుమంటున్నాయి. గత పది రోజులుగా వరుసగా ధరలు పెరుగుతుండడంతో వాటి ధరలు ఇప్పటికే గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. స్థానిక పన్నుల కారణంగా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్...

Updated : 18 Feb 2021 21:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగ్గుమంటున్నాయి. గత పది రోజులుగా వరుసగా ధరలు పెరుగుతుండడంతో వాటి ధరలు ఇప్పటికే గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. స్థానిక పన్నుల కారణంగా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే పెట్రోల్‌ ధర ‘సెంచరీ’ కొట్టేసింది. డీజిల్‌ ధర సైతం అదే బాటలో పయనిస్తోంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండడం పట్ల సామాన్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎల్‌పీజీ సిలిండర్‌ సైతం వీటికి జత కలవడంతో సోషల్‌మీడియా వేదికగా తమ అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా #petrol100 అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీ ధరలు ఏవిధంగా పోటీ పడుతున్నాయో చూపుతూ కొందరు ఫన్నీ మీమ్స్‌ షేర్‌ చేస్తున్నారు. ఇలానే పెరిగితే మళ్లీ మనకు ఎడ్ల బండే దిక్కంటూ వీడియోలు షేర్‌ చేస్తున్నారు. ఎక్కువగా క్రికెట్‌ నేపథ్యం ఉన్న మీమ్స్‌ రూపొందిస్తూ తమ అసహనాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఆ ఫన్నీ మీమ్స్‌ మీరూ చూసేయండి..












Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని