సాహితి సాహసం.. వరించిన పురస్కారం.. 

తల్లి శిక్షణతో క్రీడాకారిణిగా రాణించడమే కాకుండా.. ఆపదలో ఉన్న పిల్లల్ని కాపాడిన ఆ యువతిని కేంద్ర పురస్కారం వరించింది. విశాఖ జిల్లా కొత్తకోటకు చెందిన సాహితి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చిన్నతనం నుంచి ఈతలో నైపుణ్యం సాధించి ఎన్నో అవార్డులు అందుకుంది. తల్లిదండ్రులతో కలిసి నవంబర్‌ 4న  విహారయాత్రకు వెళ్లిన సాహితి సముద్రంలో మునిగిపోతున్న ఇద్దరు చిన్నారులను కాపాడింది...

Published : 28 Jan 2021 23:57 IST

విశాఖ: తల్లి శిక్షణతో క్రీడాకారిణిగా రాణించడమే కాకుండా.. ఆపదలో ఉన్న పిల్లల్ని కాపాడిన ఆ యువతిని కేంద్ర పురస్కారం వరించింది. విశాఖ జిల్లా కొత్తకోటకు చెందిన సాహితి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చిన్నతనం నుంచి ఈతలో నైపుణ్యం సాధించి ఎన్నో అవార్డులు అందుకుంది. తల్లిదండ్రులతో కలిసి నవంబర్‌ 4న  విహారయాత్రకు వెళ్లిన సాహితి సముద్రంలో మునిగిపోతున్న ఇద్దరు చిన్నారులను కాపాడింది. ఈ సాహసాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ రక్ష పురస్కారానికి ఎంపిక చేసింది. సాహితి లాంటి విద్యార్థి తమ కాలేజీలో చదవడం ఎంతో గర్వకారణంగా ఉందని అధ్యాపకులు, తోటి విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

ఈత వచ్చు కావున సముద్రంలో మునిగిపోతున్న చిన్న పిల్లలను త్వరగా కాపాడగలిగాను. చిన్నప్పటి నుంచి యోగా చేస్తున్నాను.  స్విమ్మింగ్ చేయడానికి యోగా చాలా ఉపయోగపడుతోంది. మా తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే నేను ఈ ఘనత సాధించాను.. నా లక్ష్యం ఐఐటీ సాధించడం. స్విమ్మింగ్‌లో 25 రికార్డులు సొంతం చేసుకున్నట్టు వెల్లడించింది. 


ఇవీ చదవండి..

రుషికొండ వద్ద పర్యాటక ప్రాజెక్టు!

 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని