సూపర్‌ పెయింటింగ్‌ అంటే ఇదే మరి!

లియోనార్డో డావిన్సీ, రాజా రవి వర్మ, ఎంఎఫ్‌ హుస్సేన్‌, సుదర్శన్‌ పట్నాయక్‌.. వీరంతా ఎవరంటే గొప్ప చిత్రకారులు, శిల్పులు అని ఠక్కున చెప్పేస్తాం.. ఎంతో మంది...

Updated : 08 Dec 2022 13:54 IST

సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: లియోనార్డో డావిన్సీ, రాజా రవి వర్మ, ఎంఎఫ్‌ హుస్సేన్‌, సుదర్శన్‌ పట్నాయక్‌.. వీరంతా ఎవరని అడిగితే గొప్ప చిత్రకారులు, శిల్పులు అని ఠక్కున చెప్పేస్తాం. ఎంతో మంది ఉన్నప్పటికీ వీరినే ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి గల కారణం.. వారి అత్యుత్తమ ప్రతిభే. అయితే ఎంతో నైపుణ్యం ఉండి సరైన గుర్తింపు పొందని చాలా మంది కళాకారులు మన సమాజంలో ఉన్నారు. సామాజిక మాధ్యమాల పుణ్యమా అని అలాంటి వారు వెలుగులోకి వస్తున్నారు.

సాధారణంగా కుంచెతో తెల్లని కాగితం, గోడలపై చిత్రాలను గీస్తుంటారు. ఇసుకతో అబ్బుర పరిచేలా సైకత శిల్పాలు రూపొందిస్తారు. అయితే వాటికి భిన్నంగా ఓ కళాకారుడు సాధు జంతువులపై తన ప్రతిభతో పెయింటింగ్‌ వేసి ఆశ్చర్యపరిచాడు. ఒక గేదె మీద పురుషుడు, స్త్రీ బొమ్మ వేశాడు. ఆ గేదె నడిచినప్పుడు మనిషి నడిచి వెళుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇలానే మరో ఆవు మీద తన చిత్ర ప్రతిభను చూపాడు. కాస్త దూరం నుంచి చూస్తే ఎవరో ఇద్దరు మనుషులు నడిచి వెళ్తున్నారని భ్రమ పడక మానరు. ఈ అద్భుతమైన పెయింటింగ్‌ను ఎవరు వేశారో తెలీదుగానీ.. సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. ఆ వీడియో మీరూ చూసేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని