Published : 26 Nov 2021 23:39 IST

Viral Video: బొమ్మ మొసలి అనుకొని వెళితే.. నోట కరుచుకొని వెళ్లింది!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒళ్లు గగ్గుర్పొడిచే సంఘటన ఇది. బొమ్మగా భావించి నిజమైన మొసలితో ఫొటో దిగేందుకు వెళ్లిన ఓ పర్యాటకుడిని.. అది నోటకరుచుకుని వెళ్లింది. అదృష్టవశాత్తూ అతడు ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఫిలిప్పైన్స్‌లోని ఓ అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

నెహెమియాస్‌ చిపదా అనే వ్యక్తి.. ఫిలిప్పైన్స్‌లోని కగయాన్‌ డీ ఓరోలోని ‘అమయా వ్యూ’ అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌కు వెళ్లాడు. అక్కడ నీటిలో ఉన్న 12 అడుగుల భారీ సైజు మొసలిని చూసి.. బొమ్మ మొసలి అనుకొని పొరబడ్డాడు. ఫెన్సింగ్‌ దాటి దాని వద్దకు వెళ్లి సెల్ఫీ తీసుకుంటుండగా.. ఒక్కసారిగా అతడి ఎడమ చేతిని నోట కరుచుకున్న మొసలి నీటిలోకి లాక్కెళ్లింది. అయితే అతికష్టం మీద దాని నుంచి విడిపించుకొని బతుకుజీవుడా అంటూ బయటపడ్డాడు.

ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మొసలి కొరకడంతో అతడి చేతికి తీవ్ర గాయమై రక్తం ధారాళంగా కారిపోయింది. కొందరు అతడికి ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. పార్కులో హెచ్చరిక బోర్డులు లేని కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. చిపదా నిబంధనలను అతిక్రమించాడని పార్కు అధికారులు పేర్కొంటున్నారు.

Read latest Viral Videos and Telugu News


Read latest Viral videos News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని