Viral Video: కెమెరామెన్‌ ముందు పరుగెత్తేశాడు!

నాలుగు కిలోల కెమేరాను పట్టుకుని మరీ ఆటగాళ్ల పక్క లైనులో వాళ్ల కంటే వేగంగా పరుగు తీస్తూ పోటీ దృశ్యాలను వీడియో తీశాడట

Updated : 21 Jul 2021 15:46 IST

బీజింగ్‌: చైనాలోని షాంగ్జి ప్రావిన్స్‌లోని డాటంగ్‌ యూనివర్సిటీలో ఈమధ్య 100 మీటర్ల పరుగు పందెం నిర్వహించారు. మామూలుగా అయితే, స్టేడియంలో కూర్చున్నవారెవరైనా ఆ సమయంలో క్రీడాకారుల వైపే చూస్తారు. కానీ ఈసారి మాత్రం అలా జరగలేదు. అందరూ ఓ కెమేరామెన్‌ వైపే చూస్తూ ఉండిపోయారట. అతడు వీడియో తీసేందుకు ఆటగాళ్లకన్నా వేగంగా పరిగెట్టాడట మరి. అదే కాలేజీలో చదువుతున్న అతడు వీడియోగ్రాఫర్‌గానూ పనిచేస్తున్నాడట. అలా ఈ క్రీడాపోటీల వీడియోని తీసే పని పడింది. మామూలుగా అయితే ఎక్కడో దూరం నుంచి మొత్తం దృశ్యం కనిపించేలా వీడియో తీస్తారు. కానీ ఇతగాడు ఏకంగా నాలుగు కిలోల కెమేరాను పట్టుకుని మరీ ఆటగాళ్ల పక్క లైనులో వాళ్ల కంటే వేగంగా పరుగు తీస్తూ పోటీ దృశ్యాలను వీడియో తీశాడట.  పోటీలో పాల్గొనలేదు కానీ మొదట గమ్యాన్ని చేరిందీ ఈ వీడియోగ్రాఫరే. అందుకే, ఇప్పుడు అతడి వీడియో వైరల్‌ అవుతోంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని