ప్లాస్టిక్‌ వ్యర్థాలతో సంగీత కచేరీ!

ప్లాస్టిక్‌ వ్యర్థాలు ప్రపంచానికి పెనుముప్పుగా మారాయి. అటు సముద్ర జీవులకు, ఇటు భూమ్మీద ఉండే ప్రాణులకు చేటు కలిగిస్తున్నాయి.

Updated : 24 Jun 2021 09:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్లాస్టిక్‌ వ్యర్థాలు ప్రపంచానికి పెనుముప్పుగా మారాయి. అటు సముద్ర జీవులకు, ఇటు భూమ్మీద ఉండే ప్రాణులకు చేటు కలిగిస్తున్నాయి. దీంతో పలువురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలని, దానివల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా టర్కీకి చెందిన ఓ అర్కెస్ట్రా బృంద సభ్యులు ప్లాస్టిక్‌ వ్యర్థాల గురించి అవగాహన కల్పించడానికి వినూత్న ప్రయత్నం చేశారు. పాడైపోయిన ప్లాస్టిక్‌ డబ్బాలతో డ్రమ్ము, గిటార్‌ను పోలిన సంగీత పరికరాలను తయారు చేసి సంగీత కచేరీ నిర్వహించారు. ఉపయోగించిన ప్లాస్టిక్‌ కవర్లతో చేసిన చొక్కాలను ధరించి, సాధారణ ప్లాస్టిక్‌ వస్తువులతో అద్భుతమైన సంగీతాన్ని సృష్టించారు. దీనికి సంబంధించిన వీడియోను మే 27న ఫంగిస్తాన్‌బుల్‌ (Fungistanbul) అనే యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా విడుదల చేశారు. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని