నోటితో కారును వెనక్కి లాగిన పులి..

సాధారణంగా  వాహనం ఆగిపోతే..  దాన్ని తోయడానికి మనుషుల సాయం కోసం ఎదురు చూస్తాం.. ఎవరైనా దారిగుండా వెళ్లేవారు చేయి వేసి వాహనాన్ని ముందుకు తోస్తే.. బండి స్టార్ట్‌ అవుతుందనేది తెలిసిన విషయం.. కానీ ఇక్కడ  బ్యాటరీ సమస్య తలెత్తడంతో ఆగిపోయిన పర్యాటకుల వాహనాన్ని ఓ పులి తన నోటితో వెనక్కి లాగిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అదేంటో చూడండి మరి...

Updated : 18 Jan 2021 22:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  సాధారణంగా  వాహనం ఆగిపోతే..  దాన్ని తోయడానికి మనుషుల సాయం కోసం ఎదురు చూస్తాం.. ఎవరైనా దారిగుండా వెళ్లేవారు చేయి వేసి వాహనాన్ని ముందుకు తోస్తే.. బండి స్టార్ట్‌ అవుతుందనేది తెలిసిన విషయం.. కానీ ఇక్కడ  బ్యాటరీ సమస్య తలెత్తడంతో ఆగిపోయిన పర్యాటకుల వాహనాన్ని ఓ పులి తన నోటితో వెనక్కి లాగిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అదేంటో చూడండి మరి..  

బెంగళూరులోని బెన్నర్‌ఘట్టా బయోలాజికల్‌ పార్కులో పర్యాటకుల వాహనం(సఫారీ) ఆగిపోయింది. దీంతో ఆ పార్కులోని ఓ పులి అక్కడికి వచ్చింది. ఈ క్రమంలో చాలా ఆకలిగా ఉన్నట్లుగా కనిపిస్తున్న పులి వాహనం వెనక భాగాన్ని నోటితో కరిచి వెనక్కి లాగడం ప్రారంభించింది. ఈ  వీడయోను ఓ వన్యప్రాణి ఔత్సాహికురాలు ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. ఈ వీడియోకు అధిక సంఖ్యలో వీక్షణలు వచ్చాయి. అనంతరం తొంభై సెకన్ల నిడివి గల ఈ వీడియో వైరల్‌గా మారింది. పులి నోటితో వాహనాన్ని లాగడం సాధ్యం కాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.   ‘పార్కులో వాహనం ఆగిపోవడంతో పులులు అక్కడికి వచ్చాయి. వాహనం వెనకభాగాన్ని ఓ పులి నోటితో కరిచి వెనక్కి లాగింది.. అనంతరం  కొద్దిసేపు అటూ ఇటూ తిరిగి అవి వెళ్లిపోయాయి. పార్కు సిబ్బంది సాయంతో వాహనం స్టార్ట్‌ అయ్యింది.  పర్యాటకుల కోసం ఎప్పుడూ తగిన జాగ్రత్తలు ఉంటాయని ఆ పార్కు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వానశ్రీ విపిన్‌ సింగ్‌ మీడియాకు తెలిపారు. 

 

ఇవీ చదవండి..

గుర్రపు స్వారీ.. అమెజాన్‌ పార్శిల్స్‌ డెలివరీ..!

మెరుపు వేగంతో స్పందించాడు.. ప్రాణం కాపాడాడు

 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని