Viral Video: ఇవేం ట్రయల్స్‌రా బాబూ!

అమెరికాకు చెందిన అత్యాధునిక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుద్ధానికి సిద్ధంగా ఉందో లేదో తెలుసుకునేందుకు యూఎస్ నౌకాదళం ఓ భారీ పేలుడుతో పరీక్షించింది.

Published : 23 Jun 2021 09:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాకు చెందిన అత్యాధునిక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుద్ధానికి సిద్ధంగా ఉందో లేదో తెలుసుకునేందుకు యూఎస్ నౌకాదళం ఓ భారీ పేలుడుతో పరీక్షించింది. ఫ్లోరిడా తీరంలో అట్లాంటిక్ మహా సముద్రంలో ‘యూఎస్‌ఎస్‌ గెరాల్డ్ ఆర్ డాట్ ఫోర్డ్‌’గా పిలుస్తున్న  ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్‌కు అత్యంత సమీపంలో ఈ పేలుడు జరిపారు. 18,144 కిలోల పేలుడు పదార్థాలతో పరీక్షించినట్లు అమెరికా మీడియా వెల్లడించింది.  నీటిలో భారీ పేలుడుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. రిక్టార్‌ స్కేలుపై 3.9 తీవ్రత గల భూకంపంగా ఇది నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది. కాగా కొత్త యుద్ధ నౌకలపై అమెరికన్‌ నేవీ ఫుల్‌షిప్‌ షాక్ ట్రయల్స్ పేరిట ఇలాంటి పరీక్షలను నిర్వహిస్తుంది. ట్రయల్స్‌ ముగిశాక యుద్ధనౌకకు మరోసారి కొన్ని మరమ్మతులు చేస్తారు. 




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని