Delhi Metro: ఫోన్‌లో మునిగిపోయి మెట్రో పట్టాలపై పడ్డాడు

ప్రస్తుత ఆధునిక యుగంలో చాలామంది తమ స్మార్ట్‌ ఫోన్‌లకు అతుక్కుపోతున్న విషయం తెలిసిందే. సోషల్‌ మీడియా యాక్సెస్‌.. బ్రౌజింగ్‌.. ఇలా ఏదోకటి చేస్తూ మొబైల్‌ను వదలడం లేదు! కొందరయితే ఫోన్‌ వాడుతున్నప్పుడు చుట్టూ ఏం జరుగుతోందో కూడా పట్టించుకోని...

Published : 05 Feb 2022 21:28 IST

వైరల్‌గా మారిన సీసీ టీవీ ఫుటేజీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుత ఆధునిక యుగంలో చాలామంది తమ స్మార్ట్‌ ఫోన్‌లకు అతుక్కుపోతున్న విషయం తెలిసిందే. సోషల్‌ మీడియా యాక్సెస్‌.. బ్రౌజింగ్‌.. ఇలా ఏదోకటి చేస్తూ మొబైల్‌ను వదలడం లేదు! కొందరయితే ఫోన్‌ వాడుతున్నప్పుడు చుట్టూ ఏం జరుగుతోందో కూడా పట్టించుకోని స్థితికి చేరుకుంటున్నారు. తాజాగా దిల్లీలోని షాహదరా మెట్రోస్టేషన్‌లో ఓ వ్యక్తి తన ఫోన్‌ చూడటంలో మునిగిపోయి.. అలాగే ప్లాట్‌ఫాంపై నడుచుకుంటూ వెళ్లి పట్టాలపై పడిపోవడం గమనార్హం. శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ప్లాట్‌ఫాంపైనుంచి పట్టాలపైకి పడిపోయిన ఆ వ్యక్తి లేచేందుకు కష్టపడుతుండగా.. పక్క ప్లాట్‌ఫాంపై ఉన్న సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అప్పటికే ఇది గమనించి అక్కడికి చేరుకున్నారు. అతన్ని ప్లాట్‌ఫాంపైకి చేర్చారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో మెట్రో రైలు రాలేదు. బాధితుడు కాలికి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై సీఐఎస్‌ఎఫ్ సైతం ఓ ట్వీట్‌ చేసింది. ‘మొబైల్ ఫోన్‌లో బిజీగా ఉన్న ఒక వ్యక్తి ప్లాట్‌ఫాం నంబర్ 1 నుంచి మెట్రో ట్రాక్‌పై పడిపోయాడు. సీఐఎస్‌ఎఫ్‌ క్యూఆర్టీ టీమ్‌కు చెందిన కానిస్టేబుల్ రోథాష్ చంద్ర వెంటనే స్పందించి.. అతన్ని సురక్షితంగా ప్లాట్‌ఫాంపైకి చేర్చాడు’ అని తెలిపింది.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని