ViralVideo: ఉట్టి మాస్క్‌

కరోనా సెకండ్‌ వేవ్‌లో వ్యాప్తి ఎక్కువగా ఉన్న తరుణంలో బహిరంగ ప్రదేశాల్లో డబుల్‌ మాస్కులు పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొందరు ఇవేమీ లెక్కచేయకుండా వింత వింత మాస్కులు పెట్టుకుంటున్నారు.

Published : 25 May 2021 23:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా సెకండ్‌ వేవ్‌లో వ్యాప్తి ఎక్కువగా ఉన్న తరుణంలో బహిరంగ ప్రదేశాల్లో డబుల్‌ మాస్కులు పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొందరు ఇవేమీ లెక్కచేయకుండా వింత వింత మాస్కులు పెట్టుకుంటున్నారు. లేగ దూడ మూతికి పెట్టే ఉట్టి లాంటి దానిలో వేప, తులసి ఆకులు ఉంచి మాస్క్‌గా ధరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌కు చెందిన ఓ వృద్ధుడు ఈ విధమైన మాస్క్‌ పెట్టుకుని కనిపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. ఇలాంటి మాస్కు కరోనా వైరస్‌ను అడ్డుకోగలదని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కాబట్టి సొంత ప్రయాత్నాలు మానుకొని నిపుణులు సూచించిన మాస్కులు పెట్టుకోవడం శ్రేయస్కరం. 



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని