Viral video: ఈ గిన్నిస్‌ రికార్డు ఫీట్‌ చూస్తే వామ్మో అనాల్సిందే..!

వరల్డ్‌ రికార్డ్స్‌ పంచుకున్న ఓ వీడియో గగుర్పాటుకు గురిచేస్తోంది. అంతటి ఎత్తులో ఓ వ్యక్తి చేసిన సాహసాన్ని చూసి ఔరా అంటున్నారు.......

Published : 09 Apr 2022 01:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్: అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించాలని ఎంతోమంది తహతహలాడుతూ ఉంటారు. అందుకు ఎంతటి సాహసానికైనా వెనకాడరు. అనుకున్న దాన్ని సాధించేందుకు ఏళ్ల తరబడి కఠోర సాధన చేస్తూ ఉంటారు. తాజాగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ పంచుకున్న ఓ వీడియో గగుర్పాటుకు గురిచేస్తోంది. అంతటి ఎత్తులో ఓ వ్యక్తి చేసిన సాహసాన్ని చూసి ఔరా అంటున్నారు.

బ్రెజిల్‌కు చెందిన స్లాక్‌లైన్ (గాల్లో తాడుపై నడిచే వ్యక్తి) ఔత్సాహికుడు రఫేల్‌ జుగ్నో బ్రిడి తాజాగా గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకున్నాడు. అతడు ఏకంగా 1901 మీటర్ల (6,326 ఫీట్లు) ఎత్తులో రెండు హాట్‌ ఎయిర్‌ బెలూన్ల మధ్య సన్నటి తాడుపై నడిచి ఈ ఘనత సాధించాడు. ఈ ఎత్తు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన కట్టడం బూర్జ్‌ ఖలీఫా కంటే రెండింతలు అధికం. కాగా ఈ సాహసానికి సంబంధించిన వీడియోను గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫీట్‌ నమ్మశక్యంగా లేదంటూ.. రఫేల్‌ జుగ్నో సాహసాన్ని మెచ్చుకుంటున్నారు. ఇప్పటికే ఈ వీడియోను లక్షల మంది వీక్షించగా దాదాపు 77వేల మంది లైక్‌ చేశారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని