Viral Video: కాలిపోతున్న లారీని నడిపిన ‘రియల్‌ హీరో’..

ఓ యువకుడి సమయస్ఫూర్తి, ధైర్య సాహసం.. పెను ప్రమాదం తప్పేలా చేసింది. కళ్ల ముందు కాలిపోతున్న లారీ దగ్గరకు వెళ్లాలంటేనే వెనకడుగు వేస్తాం. కానీ.. అతడు ఏ మాత్రం అదరలేదు. చుట్టూ ఉన్న పరిస్థితిని గమనించి దాన్ని ఏ విధంగా అదుపులోకి తీసుకురావచ్చో ఆలోచించాడు. బెదరకుండా మంటలంటుకున్న లారీని నడిపి.. ఓ సురక్షిత ప్రదేశంలో పార్క్‌ చేశాడు. 

Updated : 02 Feb 2022 15:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ యువకుడి సమయస్ఫూర్తి, ధైర్య సాహసం.. పెను ప్రమాదం తప్పేలా చేసింది. కళ్ల ముందు కాలిపోతున్న లారీ దగ్గరకు వెళ్లాలంటేనే వెనకడుగు వేస్తాం. కానీ.. అతడు ఏ మాత్రం అదరలేదు. చుట్టూ ఉన్న పరిస్థితిని గమనించి దాన్ని ఏ విధంగా అదుపులోకి తీసుకురావచ్చో ఆలోచించాడు. బెదరకుండా మంటలంటుకున్న లారీని నడిపి.. ఓ సురక్షిత ప్రదేశంలో పార్క్‌ చేశాడు. 

వివరాల్లోకి వెళ్లితే.. అది కేరళలోని కొడెన్‌చెరీ ప్రాంతం. అక్కడే వరి గడ్డితో ఫుల్‌ లోడ్‌ నిండి ఉన్న లారీకి ఓవర్‌ హెడ్‌ పవర్‌ లైన్‌ (విద్యుత్‌ తీగలు) తాకి.. లారీకి వేగంగా మంటలు వ్యాపించాయి. లోపల ఉన్న డ్రైవర్‌ నిస్సహాయ స్థితిలో ఉండటం గమనించిన షాజీ వర్గీస్‌ అనే యువకుడు... ఏ మాత్రం బెదరకుండా లారీలోకి ప్రవేశించాడు. జనసంచారం లేని ఓ ఖాళీ ప్లే గ్రౌండ్‌లోకి లారీని నడిపి..  అక్కడ పార్క్‌ చేశాడు.

ఈ ట్రిక్‌ని ఉపయోగించే కాపాడాడట..
నేరుగా కాకుండా జిగ్‌జాగ్‌ పద్ధతిలో లారీని నడిపితే సురక్షితంగా ఉంటుందని భావించిన షాజీ వర్గిస్‌.. అదే పద్ధతిని అనుసరించాడు. ఫైర్‌ సిబ్బంది రావడాని కన్నా ముందే పరిస్థితిని తీసుకొచ్చేందుకు వర్గీస్‌తో పాటు ఇతర వాలంటీర్లు నిర్విరామంగా శ్రమించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన ఫుటేజ్‌ వైరల్‌ అయ్యింది. వర్గీస్‌ తెగువను మెచ్చి ప్రశంసలు కురిపిస్తున్నారు


 



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని