Ratlam: ముందుగా వచ్చిన రైలు.. ఆనందంతో ప్రయాణికులు ఏం చేశారంటే!

మన దేశంలో రైళ్ల సమయపాలనపై కొన్నిసార్లు జోకులు పేలుతుంటాయి. ఎప్పుడూ ఆలస్యమేనంటూ వ్యాఖ్యానాలు వినిపిస్తాయి! కానీ, బుధవారం రాత్రి మధ్యప్రదేశ్‌లోని రత్లాం రైల్వేస్టేషన్‌లో మాత్రం ఓ ఆసక్తికర దృశ్యం నమోదైంది. ఓ రైలు సమయానికి...

Published : 27 May 2022 02:06 IST

దిల్లీ: మన దేశంలో రైళ్ల సమయపాలనపై కొన్నిసార్లు జోకులు పేలుతుంటాయి. ఎప్పుడూ ఆలస్యమేనంటూ వ్యాఖ్యానాలు వినిపిస్తాయి! కానీ, బుధవారం రాత్రి మధ్యప్రదేశ్‌లోని రత్లాం రైల్వేస్టేషన్‌లో మాత్రం ఓ ఆసక్తికర దృశ్యం నమోదైంది. ఓ రైలు సమయానికి 20 నిమిషాల ముందుగానే రావడంతో.. కొంతమంది ప్రయాణికులు సంతోషంతో సంబరాలు చేసుకున్నారు! ప్లాట్‌ఫాంపైకి చేరుకుని సంప్రదాయ గర్భా నృత్యంతో ఆకట్టుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

బాంద్రా నుంచి హరిద్వార్ వెళ్లాల్సిన రైలు బుధవారం రాత్రి 10.35 గంటలకు రత్లాం స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంది. కానీ, 20 నిమిషాల ముందుగానే వచ్చింది. ఇక్కడ ట్రైన్‌ 10 నిమిషాలపాటు ఆగుతుంది. ఈ క్రమంలో అరగంట సమయం దొరకడంతో.. ప్లాట్‌ఫాంపైకి చేరుకున్న పదుల సంఖ్యలో ప్రయాణికులు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. సంబంధిత వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. హ్యాపీ జర్నీ అని రాసుకొచ్చారు. రైలు ముందుగా వచ్చినప్పుడు.. అది నిజంగా సంతోషమేనని ఓ నెటిజన్‌ కామెంట్‌ పెట్టారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని